నిమ్మగడ్డకు ఉద్యోగుల షాక్: ప్రాణాలు ఫణంగా పెట్టలేం

Published : Nov 04, 2020, 10:17 AM IST
నిమ్మగడ్డకు ఉద్యోగుల షాక్: ప్రాణాలు ఫణంగా పెట్టలేం

సారాంశం

కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పునరాలోచన చేయాలని ఏపీ ఎన్‌జీవోల సంఘం కోరింది. ఈ మేరకు ఎన్‌జివోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్  రెడ్డి ఈ విషయమై  కీలక ప్రకటన చేశారు.

అమరావతి: కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పునరాలోచన చేయాలని ఏపీ ఎన్‌జీవోల సంఘం కోరింది. ఈ మేరకు ఎన్‌జివోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్  రెడ్డి ఈ విషయమై  కీలక ప్రకటన చేశారు.

కరోనా సమయంలో ఉద్యోగులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టలేమని ఆయన చెప్పారు. కరోనా తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

త్వరలోనే ఉద్యోగులంతా అమరావతి నుండి విశాఖపట్టణం వచ్చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఉద్యోగులంతా విశాఖను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నారని ఆయన చెప్పారు. 

కరోనా సమయంలో నిలిపివేసిన వేతనాలను ఈ నెల నుండి చెల్లిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు ఇచ్చేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గత  నెల 28వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల విషయమై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది.

also read:నిమ్మగడ్డ పిటిషన్: జగన్ సర్కార్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని రాష్ట్ర హైకోర్టు  మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇదే సమయంలో ఏపీ ఎన్‌జీఓల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు  ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?