
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల విడుదల తేదీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి ఫలితాలను మే 6వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చల సందర్బంగా బొత్స ఈ విషయం తెలిపారు. రేపు ఉదయయం 11 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు.. అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ ను సందర్శించడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇరాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరిగింది. సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26 మధ్య జరిగింది.