గొల్లలగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త అనుమానాస్పదమృతి: ఆరా తీసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

By narsimha lodeFirst Published Feb 2, 2021, 3:44 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లలగుంట గ్రామంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి పుష్పలత భర్త శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మంగళవారం నాడు మరణించాడు. ఈ గ్రామాన్ని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సందర్శించారు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లలగుంట గ్రామంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి పుష్పలత భర్త శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మంగళవారం నాడు మరణించాడు. ఈ గ్రామాన్ని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సందర్శించారు.

శ్రీనివాస్ రెడ్డి గ్రామంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. రెండు రోజుల క్రితం ఆయనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాళ్లు చేతులు కట్టేసి కిడ్నాప్ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని బెదిరించారని  ఆయన చెప్పారు. తన భర్తను వైసీపీ వర్గీయులు కిడ్నాప్ చేశారని  పుష్పలత ఆరోపించారు.

ఈ ఘటన జరిగిన రెండు రోజులకే  శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ విషయం తెలుసుకొన్న ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామాన్ని సందర్శించారు. సంఘటన గురించి బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకొన్నారు.

also read:జగ్గంపేటలో టీడీపీ సర్పంచ్ భర్త కిడ్నాప్

ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు. రాజకీయాలు మాట్లాడేందుకు తాను రాలేదని ఆయన అన్నారు. 

ఈ కేసులో మానవతా థృక్పథంతో వ్యవహరించాలని ఆయన అధికారులను కోరారు. మృతదేహాన్ని కాకినాడకు చెందిన ప్రొఫెసర్ల బృందం నిర్వహించనుందని ఆయన చెప్పారు..

మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదును కూడ పరిగణనలోకి తీసుకొంటామన్నారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

click me!