అసాధారణ ఏకగ్రీవాలపై దృష్టి: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్

Published : Feb 03, 2021, 02:39 PM IST
అసాధారణ ఏకగ్రీవాలపై దృష్టి: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్

సారాంశం

ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకం కాదని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు.

అమరావతి: ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకం కాదని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు.

బుధవారం నాడు ఆయన అమరావతిలో ఆయన ఈ-వాచ్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోటీ చేసి ఆత్మవిశ్వాసంతో  ఆ పొజిషన్ ను చేజిక్కుంచుకొనే నాయకత్వ లక్షణాలు ఈ వ్యవస్థకు కావాలన్నారు.

also read:స్థానిక సంస్థల ఎన్నికలు: ఫిర్యాదుల కోసం ఈ-వాచ్ యాప్ ఆవిష్కరించిన నిమ్మగడ్డ

అసాధారణ ఏకగ్రీవాలపై దృష్టి పెడతామని ఆయన చెప్పారు.  రాష్ట్రంలో ఏకగ్రీవాలపై  విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  అధికార పార్టీ నేతలు అధికారాన్ని ఉపయోగించుకొని ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఎన్నికలు జరగకుండా  ఏకగ్రీవంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకొన్న గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించుకొని విపక్షాల అభ్యర్ధులను పోటీలో లేకుండా చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.చిత్తూరు జిల్లాలో ఏకపక్షంగా ఏకగ్రీవాలు జరిగిన విషయమై చంద్రబాబునాయుడు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. బీజేపీ నేత సోము వీర్రాజు కూడ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.విపక్షాల విమర్శల నేపథ్యంలో ఏపీ ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!