నామినేషన్లు వేసేవారిపై దొంగ కేసులు పెడుతున్నారు: సోమువీర్రాజు

Published : Feb 03, 2021, 01:47 PM IST
నామినేషన్లు వేసేవారిపై దొంగ కేసులు పెడుతున్నారు: సోమువీర్రాజు

సారాంశం

: ఏకగ్రీవాలు సహజంగా జరగాలి కానీ....ప్రభుత్వ ఒత్తిడితో కాదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు.  


అమరావతి: ఏకగ్రీవాలు సహజంగా జరగాలి కానీ....ప్రభుత్వ ఒత్తిడితో కాదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు.బుధవారంనాడు  ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. నామినేషన్లు వేసేవారిపై దొంగ కేసులు పెడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అన్ని విషయాలు చెప్పినట్టుగా ఆయన తెలిపారు.

 వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఏపీకి నిధులు ఇవ్వలేదని విజయసాయిరెడ్డి అనడం హాస్యాస్పదమని సోము వీర్రాజు పేర్కొన్నారు. బడ్జెట్ అనేది అంశాల ప్రాతిపదికన ఉంటుందన్నారు.

 ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబు ప్రత్యేక హోదా అంటారని విమర్శించారు. ఫిర్యాదుల కోసం బీజేపీ టోల్‌ఫ్రీ ని  ఏర్పాటు చేసిందన్నారు. ఫిర్యాదులను  9650713714 నెంబర్ కు ఫోన్ చేసిన చెప్పాలని సోమువీర్రాజు కోరారు.
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!