వైసీపీకి ఓటు వేయలేదని వివక్ష వద్దు: కొత్త మేయర్లు, ఛైర్మన్లకు జగన్ దిశానిర్దేశం

By Siva KodatiFirst Published Apr 1, 2021, 4:14 PM IST
Highlights

అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ చైర్మన్‌లకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడలో మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జగన్ ప్రసంగిస్తూ.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు.

ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలని.. పట్టణాల్లో  పరిశుభ్రతపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. పేదల కాలనీలు అందంగా తీర్చిదిద్దాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 78 శాతం పదవులు ఇచ్చామని జగన్ గుర్తుచేశారు.

22 నెలల్లో ప్రజలకు నేరుగా ఆర్ధిక లబ్ధి అందించే పథకాలు అమలు చేశామని.. శిథిలావస్తకు చేరిన స్కూళ్ల రూపు రేఖలు మారుతున్నాయని.. ప్రభుత్వాసుపత్రుల  రూపు రేఖలు మార్చుతున్నామని చెప్పారు.

రైతులకు ఊరిలోనే  అన్ని సదుపాయాలను అందించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో ప్రజలు మనపై పెట్టిన  బాధ్యత మరింత పెరిగిందని జగన్ అన్నారు. మహిళలకు చట్టం ప్రకారం ఇవ్వాల్సిన స్థానం కంటే 62 శాతం అదనంగా ఇచ్చామని చెప్పారు.

కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ మహిళలకు పెద్దపీట వేశామని జగన్ పేర్కొన్నారు. మనం పాలకులం కాదు.. సేవకులం అనేది గుర్తు పెట్టుకోవాలని సీఎం సూచించారు. ప్రతి వార్డుకు రెండు చెత్త సేకరణ వాహనాలు ఉండాలని.. జూలై 8 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభంకానుందని చెప్పారు. ఓటు వేయనివారిపై వివక్ష చూపొద్దని ముఖ్యమంత్రి సూచించారు. 

click me!