గవర్నర్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ: స్థానిక సంస్థలపై చర్చ

By narsimha lodeFirst Published Feb 22, 2021, 7:51 PM IST
Highlights

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సోమవారం నాడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరును గవర్నర్‌కు ఆయన వివరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎస్ఈసీ తెలిపారు. 

విజయవాడ‌: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సోమవారం నాడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరును గవర్నర్‌కు ఆయన వివరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎస్ఈసీ తెలిపారు. 

నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల వివరాలు, ఏకగ్రీవాలు తదితర విషయాలతో కూడిన నివేదికను ఎస్‌ఈసీకి గవర్నర్‌ నివేదించినట్లు సమాచారం. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో వాటి నిర్వహణపైనా గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో నిర్వహించిన విధానాన్నే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అనుసరించాలని ఎస్‌ఈసీ భావిస్తోంది.

నాలుగు దశల్లో పంచాయితీ ఎన్నికలు రాష్ట్రంలో పూర్తయ్యాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహలు చేస్తోంది. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా  తీసుకొన్నాయి.

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ అత్యథిక స్థానాలను గెలుచుకొంది. మున్సిపల్, మండల ఎన్నికల్లో కూడ తామే అధిక స్థానాలను కైవసం చేసుకొంటామని వైసీపీ ధీమాతో ఉంది.

click me!