ఏపీ సీఎస్ లేఖ ఎఫెక్ట్: జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేసుకొన్న ఎస్ఈసీ

By narsimha lodeFirst Published Nov 18, 2020, 3:47 PM IST
Highlights

జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ఇవాళ నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్ ను ఎన్నికల సంఘం రద్దు చేసుకొంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
 

అమరావతి: జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ఇవాళ నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్ ను ఎన్నికల సంఘం రద్దు చేసుకొంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది.

అయితే కరోనా కేసుల నేపథ్యంలో  ఎన్నికల నిర్వహణకు సిద్దంగా లేమని ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్ పై కూడ సీఎస్ సహానీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

also read:స్థానిక సంస్థల ఎన్నికలు: హైకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ఎస్ఈసీ

ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల వరకు స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్  జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ఎస్ఈసీ కూడ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్లాన్ చేసింది.

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా లేదని ప్రకటిస్తూ లేఖ రాయడం...ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ ను రద్దు చేసుకొంది.వీడియో కాన్పరెన్స్ రద్దు కావడంతో  కార్యాలయం నుండి ఎస్ఈసీ సెక్రటరీ వాణీ మోహన్ వెళ్లిపోయారు.జిల్లా కలెక్టర్లు, పంచాయితీ అధికారులు, జడ్పీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉంది. 

ఎన్నికల నిర్వహణ విషయమై ప్రభుత్వం సహకరించడం లేదని ఏపీ గవర్నర్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

click me!