చంద్రబాబు ఆరోగ్యంగానే వున్నారు.. ఆసుపత్రికి అక్కర్లేదు , రోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు : ఏపీ జైళ్ల శాఖ డీఐజీ

Siva Kodati | Published : Oct 14, 2023 6:47 PM
Google News Follow Us

సారాంశం

చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా లేరని, ఆయన కోసం అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు . డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్‌ను ఫాలో అవుతున్నామని.. ఈ నివేదికను కోర్టుకు సమర్పిస్తామని డీఐజీ వెల్లడించారు.  

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై స్పందించారు ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్. శనివారం ఆయన వైద్యులతో కలిసి రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటలూ చంద్రబాబుకు జైలు సిబ్బంది అందుబాటులో వుంటున్నారని తెలిపారు. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని.. ఎవరితో ఎలా నడుచుకోవాలో మాకు తెలుసునని రవికిరణ్ స్పష్టం చేశారు. 

ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకుంటున్నామని.. లోకేష్‌తో దురుసుగా వ్యవహరించలేదని, ములాఖత్ సమయం అయిపోయిందని గుర్తుచేశామన్నారు. చంద్రబాబు హై ప్రొఫైల్ ఖైదీ మాత్రమేనని.. చంద్రబాబు మెడికల్ రిపోర్టులను ఆయన న్యాయవాదులే అడిగారని రవికిరణ్ వెల్లడించారు. మెడికల్ రిపోర్టు ఇవ్వాలని అని తాము చంద్రబాబును అడిగామని ఆయన చెప్పారు. చంద్రబాబు అనుమతితోనే రిపోర్టును ఆయన న్యాయవాదులకు ఇచ్చామని రవికిరణ్ పేర్కొన్నారు. డాక్టర్లు ఇచ్చిన నివేదికను యధాతథంగా చంద్రబాబు లాయర్లకు ఇచ్చామని డీఐజీ పేర్కొన్నారు. 

Also REad: జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కీలక నివేదిక..

తాము ఎవరితోనైనా గౌరవంగానే వ్యవహరిస్తామని.. డెర్మటాలజిస్ట్ చంద్రబాబును పరీక్షించి కొన్ని రికమండేషన్స్ చేశారని రవికిరణ్ చెప్పారు. చంద్రబాబు కోసం అత్యుత్తమ డాక్టర్ల బృందం అందుబాటులో వుందని.. మా డాక్టర్లు ప్రతీరోజూ మూడుసార్లు చంద్రబాబును పరీక్షిస్తున్నారని ఆయన తెలిపారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్‌ను ఫాలో అవుతున్నామని.. ఈ నివేదికను కోర్టుకు సమర్పిస్తామని డీఐజీ వెల్లడించారు. చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా లేరని, ఆయన కోసం అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని రవికిరణ్ తెలిపారు. జైలులో ఏసీ పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవని.. ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు పరిశీలిస్తామని డీఐజీ పేర్కొన్నారు. 

ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యంగానే వున్నారని తెలిపారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని.. ఐదుగురు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించిందని శివకుమార్ చెప్పారు. చంద్రబాబుతో తాను స్వయంగా మాట్లాడానని.. ఆయనను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదని శివకుమార్ పేర్కొన్నారు. చంద్రబాబుకు స్కిన్ అలర్జీ వుందని.. ఆయన వ్యక్తిగత వైద్యులను సంప్రదించి ట్రీట్‌మెంట్ ఇచ్చామని చెప్పారు.

రిమాండ్‌కు రాకముందు చంద్రబాబుకు ఎలాంటి వ్యాధులు వున్నాయో తమకు తెలియదని శివకుమార్ తెలిపారు. చంద్రబాబు వేసుకుంటున్న మందులను ఆయన మాకు చూపించారని శివకుమార్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబును చల్లని ప్రదేశంలో వుంచాలని శివకుమార్ చెప్పారు. 

Read more Articles on