ఆంధ్రాలో తుపాకుల కలకలం.. ఎన్నికల వేళ హాట్ టాపిక్

Published : Mar 25, 2024, 06:15 AM IST
ఆంధ్రాలో తుపాకుల కలకలం.. ఎన్నికల వేళ హాట్ టాపిక్

సారాంశం

ఏపీలో రెండు తుపాకులు, మూడు బుల్లెట్ల వ్యవహారం కలకలం రేపుతున్నది. విశాఖలో ఓ ట్రావెల్స్ మేనేజర్ వద్ద నుంచి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయనను ప్రశ్నించగా.. అవి తనవి కావడని, ఓ ప్రయాణికుడు మరిచిపోతే తాను తీసుకున్నానని చెప్పాడు.  

ఆంధ్రాలో ఎన్నికల వాతావరణం హీటెక్కుతున్నది. ఈ సందర్భంలో తుపాకుల కలకలం రేగింది. రెండు లేటెస్ట్ గన్నులు, మూడె బుల్లెట్లు విశాఖలో దొరికాయి. జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి వీటిని వైజాగ్‌కు తీసుకురావడంతో అనుమానాలు మరింత పెరిగాయి.

వైజాగ్‌లోని శ్రీకృష్ణ ట్రావెల్స్ మేనేజర్ శివనాగరాజు నుంచి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. వీటి గురించి శివనాగరాజును పోలీసులు ప్రశ్నించారు. ఈ పిస్టల్స్ ఆయన వద్దకు ఎలా వచ్చాయని అడిగారు. ఈ తుపాకులు తనకు చెందినవి కావని ఆయన చెప్పాడు. జార్ఖండ్‌కు చెందిన కునాల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి విశాఖ నుంచి బెంగళూరు వెళ్లుతుండగా.. పిస్టల్స్‌ను బస్సులో మరిచిపోయాడని, అవి తాను తీసుకున్నానని వివరించాడు. అంతే తప్పితే తనకు ఆ తుపాకులతో ఏ సంబంధమూ లేదని స్పష్టం చేశాడు.

దీంతో పోలీసుల దృష్టి ఆ జార్ఖండ్ వాసిపైకి మళ్లింది. ఆయన ఎవరు? ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు వచ్చాడు? తుపాకులను ఎందుకు తెచ్చాడు? ఈ తుపాకులు లైసెన్స్‌లు ఉన్నాయా? వంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మరికొన్ని గంటల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు.. 365 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు.. భారీ ఏర్పాట్లు
మురసు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం | CM Chandrababu Reviews Flood Situation