ఏపీలో తీర ప్రాంతాల్లో ముమ్మరంగా గస్తీ ఏర్పాట్లు

Published : Sep 12, 2019, 10:21 AM IST
ఏపీలో తీర ప్రాంతాల్లో ముమ్మరంగా గస్తీ ఏర్పాట్లు

సారాంశం

ఏపీ తీర ప్రాంతంలో గస్తీని పోలీసులు ముమ్మరం చేశారు. ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.

అమరావతి:ఏపీ రాష్ట్రంలోని తీర ప్రాంతంలో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తీర హై అలర్ట్ విధించారు.

దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. గుజరాత్ తీర ప్రాంతంలో ఇటీవల కాలంలో రెండు బోట్లు అనుమానాస్పదస్థితిలో కన్పించాయి. దీంతో నిఘా వర్గాలు ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి.

ఏపీ తీర ప్రాంతంలో కూడ పోలీసులు అలర్ట్ అయ్యారు. తీర ప్రాంతంలో మత్స్యకారులను కూడ పోలీసులు సమాచారం ఇచ్చారు. కొత్త వ్యక్తులు తీర ప్రాంతంలో కన్పిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.


 

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు