జగన్ కొత్త మంత్రివర్గంలో చోటుదక్కేది వీరికే... ఎమ్మెల్యేల పేర్లతో లిస్ట్ వైరల్

Arun Kumar P   | Asianet News
Published : Mar 17, 2022, 02:39 PM ISTUpdated : Mar 17, 2022, 02:48 PM IST
జగన్ కొత్త మంత్రివర్గంలో చోటుదక్కేది వీరికే... ఎమ్మెల్యేల పేర్లతో లిస్ట్ వైరల్

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సామాజిక వర్గాల వారిగా కొత్తగా మంత్రిపదవులు దక్కే అవకాశాలున్న ఎమ్మెల్యేల లిస్ట్ సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ (ap cabinet) పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్దమయ్యింది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ మంత్రిమండలిలో మార్పులుచేర్పులు వుంటాయిని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఉగాది పండగ నాటికి కొత్తమంత్రులు కొలువుదీరే అవకాశాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ, ప్రస్తుత మంత్రుల్లో ఆందోళన మరింత ఎక్కువయ్యింది.  

అయితే ఇప్పటికే ఎవరిని మంత్రిమండలి నుండి ఉద్వాసన పలకాలి...ఎవరికి కొత్తగా అవకాశం కల్పించాలన్నదానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే కొత్త మంత్రుల లిస్ట్ ఇదేనంటూ కొందరే ఎమ్మెల్యేల పేర్లతో కూడిన లిస్ట్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సామాజిక వర్గాల వారిగా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయో ఈ లిస్ట్ బయటపెట్టింది. అయితే లిస్ట్ అధికారికంగా వెలువడకున్నా ఇదే నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. 

సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న జగన్ కొత్త మంత్రిమండలి ఇదే: 

మంత్రులుగా కొనసాగేవారు:  

1)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2)బొత్స సత్యనారాయణ
3)బుగ్గన రాజేంద్ర రెడ్డి 
4)కొడాలి (నాని) వెంకటేశ్వరరావు
5)పేర్ని వెంకట్రామయ్య (నాని)

సామాజికవర్గాల వారిగా మంత్రిపదవులు దక్కే అవకాశమున్నవారు: 

ఎస్టి సామాజిక వర్గం:

1)పెడిక రాజన్న దొర,
2)తెల్లం బాలరాజు
3)కొట్టు భాగ్యలక్ష్మి
4)చెట్టి పాల్గుణ

ఎస్సీ సామాజిక వర్గం:

1)పండుల రవీంద్ర బాబు
2)గొల్ల బాబురావు
3)తలారి వెంకట్రావు
4)మేరుగు నాగార్జున
5)వరప్రసాద రావు
6)కోరుముట్ల శ్రీనివాస్
7)తోగురు అర్థర్

కాపు సామాజిక వర్గం:

1)దాడిశెట్టి రాజా
2)జక్కంపూడి రాజా
3)గ్రంధి శ్రీనివాస్
4)సామినేని ఉదయభాను
5)అంబటి రాంబాబు
6)తోట త్రిమూర్తులు

బీసీ సామాజిక వర్గం:

1)కొలుసు పార్థసారథి
2)ధర్మాన ప్రసాదరావు
3)తమ్మినేని సీతారాం
4)జోగి రమేష్
5)పొన్నాడ సతీష్ 
6)కారుమూరి వెంకట 
7)రమణ నాగేశ్వరావు,

మైనార్టీ సామాజిక వర్గం:

1)హాఫీజ్ ఖాన్,
2)రుహుల్ల

క్షత్రియ సామాజిక వర్గం:

1)ముదునూరి ప్రసాద్ రాజు

మహిళలు:

1)రెడ్డి శాంతి
2)ఆర్ కే రోజా రెడ్డి
3)విడుదల రజిని
4)జొన్నలగడ్డ పద్మావతి
5)విశ్వాసరాయి కళావతి
6)ఉషశ్రీ శరణ్
7మేకపాటి లత (మేకపాటి గౌతమ్ రెడ్డి)  

రెడ్డి సామాజిక వర్గం:

1)ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
2)గండికోట శ్రీకాంత్ రెడ్డి
3)నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
4)భూమన కరుణాకర్ రెడ్డి
5)కాకాని గోవర్ధన్ రెడ్డి
6)కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
7)అనంత వెంకట రామిరెడ్డి
8)తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
9)చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 10)ఆళ్ల రామకృష్ణారెడ్డి
11)పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
12)రాంభూపాల్ రెడ్డి

ఇక మంత్రి వర్గం నుండి తొలగించిన వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు, అలాగే రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తామని జగన్ చెప్పారు. పార్టీ కోసం కష్టపడుతూ మీరు గెలిచి, పార్టీని గెలిపించుకుని రావాలని.. అప్పుడు మళ్లీ మీకే మరోసారి అవకాశాలు వస్తాయని మంత్రిపదవులను కోల్పోయే నాయకులకు సీఎం జగన్ ఇటీవల దిశానిర్దేశం చేసారు. రెండు సంవత్సరాల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని... ఇది మనకు పరీక్షా సమయమని సీఎం జగన్ హెచ్చరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు