కృష్ణా జిల్లాలో దారుణం... అధికార పార్టీ నాయకుడి వేధింపులతో మహిళా వీఏఓ ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Mar 17, 2022, 01:41 PM ISTUpdated : Mar 17, 2022, 01:49 PM IST
కృష్ణా జిల్లాలో దారుణం...  అధికార పార్టీ నాయకుడి వేధింపులతో మహిళా వీఏఓ ఆత్మహత్య

సారాంశం

అధికార పార్టీకి చెందిన నాయకుడి వేధింపులు భరించలేక, పోలీసులకు పిర్యాదు చేసినా పలితం లేక  ఓ మహిళా వీఏఓ ఆత్మహత్య చేసుకున్న దారుణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

విజయవాడ: కృష్ణా జిల్లాతో దారుణం జరిగింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి వేధింపులు భరించలేక బందరు మండల వీఏఓ (village adminstrative officer)ల సంఘం నాయకురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది.  

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా (krishna district) బందరు మండలం  భోగిరెడ్డిపల్లికి చెందిన నాగలక్ష్మి వీఏఓ (VAO)గా పనిచేస్తోంది. మండల వీఏఓల సంఘం అధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమెపై వైసిపి నాయకుడు గరికపాటి నరసింహారావు చాలాకాలంగా వేధిస్తున్నాడు. ఇటీవల కాలంలో అతడి వేధింపులు మరీ మితిమీరిపోవడంతో ఇక భరించలేకపోయిన నాగలక్ష్మీ పోలీసులను ఆశ్రయించింది.

అయితే నెలరోజుల క్రితమే నాగలక్ష్మి ఫిర్యాదు చేసినా బందరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన నరసింహారావు మరింతగా వేధించడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయని నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. 

అయితే నాగలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కొనఊపిరితో వుండగా గమనించిన కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు మెరుగైన చికిత్స అందించినా పలితం లేకుండా పోయింది. పరిస్థితి పూర్తిగా విషమించడంతో నాగలక్ష్మి మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

పోలీసులు నాగలక్ష్మి పిర్యాదుపై స్పందించి నరసిహారావుపై చర్యలు తీసుకుని వుంటే ఇలా ఆత్మహత్య చేసుకునేది కాదని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ ఆత్మహత్య జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. నాగలక్ష్మి మృతదేహాన్ని వీఎఓల సంఘం జిల్లా నాయకురాలు కమల సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. 

నాగలక్ష్మిని వేధించి ఆత్మహత్యకు కారణమైన వైసిపి నాయకుడిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని భోగిరెడ్డిపల్లి గ్రామస్తులతో పాటు ఇతర వీఏఓ లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఓ మహిళ తనను వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇదిలావుంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతిపై తెలిసిన యువకుడే అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగైదు రోజుల క్రితమే యువతిపై అత్యాచారయత్నం జరిగినా భయపడిపోయిన ఆమె ఈ విషయం బయటపెట్టలేదు. అయితే యువతి ధైర్యం తెచ్చుకుని పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. 

 శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలోని దేవాంగుల వీధికి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన చిన్నారావు  అనే యువకుడు యువతిపై కన్నేసాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. అతడి ప్రేమను యువతి అంగీకరించకపోవడంతో కోపం పెంచుకుని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. తనను ప్రేమించకున్నా లైంగిక వాంఛ తీర్చాలని... లేకపోతే అంతుచూస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. 

ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీన యువతి పనిపై శ్రీకాకుళం వెళ్ళగా ఈ విషయం ఎలాగో చిన్నారావుకు తెలిసింది. ఇదే అదునుగా భావించి యువతి కోసం కాపుకాసాడు. ఈ క్రమంలోనే రాత్రి 9గంటల సమయలో ఆమె సింగుపురం కొండపోచమ్మ చెరువు వద్ద బస్సుదిగింది. ఒంటరిగా ఇంటికి వెళుతుండగా అప్పటికే అక్కడే కాపుకాసిన చిన్నారావు ఆమెను రోడ్డుపక్కన పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం చేసాడు. ఇదే సమయంలో ఓ వాహనం అటువైపు రావడంతో బాలికను వదిలి చిన్నారావు పరారయ్యాడు. వాహనంలోని వారు బాలికను సురక్షితంగా ఇంటికి చేర్చడంతో దారుణం తప్పింది.  

  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu