చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు కేసీఆర్ కూడా ప్రవేశపెట్టలేదు : మంత్రి సోమిరెడ్డి

Published : Feb 16, 2019, 03:21 PM IST
చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు కేసీఆర్ కూడా ప్రవేశపెట్టలేదు : మంత్రి సోమిరెడ్డి

సారాంశం

ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగిస్తోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అమలు చెయ్యడం లేదన్నారు. 

అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు హైదరాబాద్ లో కూర్చుని తెలుగుదేశం పార్టీని దెబ్బతియ్యాలని కుట్ర పన్నుతున్నారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ప్రధాని నరేంద్రమోదీ డైరెక్షన్లో నడుస్తున్నారని ఆరోపించారు. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు పార్టీలో అలజడి సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వంతో బెదిరింపులుకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులను కేంద్రప్రభుత్వం ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ బెదిరింపులకు భయపడే పలువురు పార్టీ వీడుతున్నారని స్పష్టం చేశారు. 

పార్టీ వీడేవాళ్లంతా స్వార్థం కోసమే పార్టీ వీడుతున్నారని వారు పార్టీ వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు. పార్టీ వీడేవాళ్లంతా 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిన వారే తప్ప అంతకు ముందు పార్టీలో ఉన్నవారు కాదన్నారు. 

ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగిస్తోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అమలు చెయ్యడం లేదన్నారు. 

సుఖీభవ పథకం కానీ, పసుకు-కుంకుమ పథకం కానీ, రైతు రుణామాఫీ వంటి పథకాలు తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. పింఛన్లు భారీ స్థాయిలో పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పుకొచ్చారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్