మహిళలను కించపర్చడమేనా మీ సంస్కృతి: బండారు వ్యాఖ్యలకు రోజా కౌంటర్

By narsimha lode  |  First Published Oct 2, 2023, 2:39 PM IST

టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి  తనపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా స్పందించారు.  టీడీపీ నేతల సంస్కృతి ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. 


అమరావతి: మహిళలను కించపర్చడమే మీ సంస్కృతా అని  టీడీపీ నేతలనుద్దేశించి  ఏపీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. సోమవారంనాడు ఏపీ మంత్రి రోజా  మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలకు ఆమె కౌంటరిచ్చారు.హిందూ సంప్రదాయాలు ఏం చెబుతున్నాయన్నారు.  కానీ  టీడీపీ నేతలు  మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో సమాజం చూస్తుందని ఆమె చెప్పారు. బండారు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేగా కూడ ఆయన గెలవలేదంటే  ఆయనను ప్రజలు  తిరస్కరించారని అర్ధమౌతుందని ఆమె తెలిపారు. ఇలాంటి వ్యక్తులను చట్టం శిక్షిస్తుందని మంత్రి రోజా  చెప్పారు.

ఇటీవల మంత్రి రోజాపై మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి రోజాపై  తీవ్ర విమర్శలు చేశారు.   నారా భువనేశ్వరి, బ్రహ్మణిల గురించి  మాట్లాడే అర్హత లేదని  బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. నీ చరిత్ర అందరికీ తెలుసునన్నారు. నీ బాగోతం బయటపెడితే  నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారని  వ్యాఖ్యానించారు. భువనేశ్వరి, బ్రహ్మణికి క్షమాపణ చెప్పకపోతే  నీ చరిత్రను బయటపెడతానని ఆయన వార్నింగ్ ఇచ్చారు.ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్  వాసిరెడ్డి పద్మ పోలీసులను ఆదేశించారు. 

Latest Videos

undefined

also read:అనకాపల్లిలో అర్థరాత్రి ఉద్రిక్తత.. మాజీ మంత్రి బాండారు ఇంటి సమీపంలోకి భారీగా చేరుకున్న పోలీసులు

అనకాపల్లి జిల్లాలోని పరవాడ మండలంలోని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి సోమవారం నాడు తెల్లవారుజామున పోలీసులు భారీగా  చేరుకున్నారు.  ఏపీ మంత్రి రోజాపై  మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి  ఇంటికి పోలీసులు వచ్చినట్టుగా  ప్రచారం సాగుతుంది.  సత్యనారాయణ మూర్తి ఇంట్లోకి పోలీసులు వెళ్లకుండా  కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే  టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కూడ బండారు సత్యనారాయణ మూర్తి ఇంటికి చేరుకుని  పోలీసులతో చర్చించారు.  ఏపీ మంత్రి రోజాపై  అనుచిత వ్యాఖ్యలు చేశారని  మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసును నిరసిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తన ఇంట్లోనే  నిరసనకు దిగారు. 
 

click me!