సీఎస్ లిమిట్స్ దాటుతున్నారు, ఆ హక్కు మీకు లేదు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Apr 26, 2019, 3:28 PM IST
Highlights

సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో ప్రత్తిపాటి ప్రధాని మోదీ, అమిత్ షాల ఆదేశాల మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 


గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం టార్గెట్ గా టీడీపీ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబుతోపాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా ప్రత్తిపాటి పుల్లారావులు వరకు టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. 

సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో ప్రత్తిపాటి ప్రధాని మోదీ, అమిత్ షాల ఆదేశాల మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

మోదీ, అమిత్ షా కుట్రల్లో భాగంగానే ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ గా నియమించారని పుల్లారావు ఆరోపించారు. అటు ఎలక్షన్ కమిషన్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. వైసీపీ నేతలు ఫిర్యాదు చెయ్యగానే నిజాయితీగా పనిచేస్తున్న అనిల్ చంద్ర పునేఠాను మార్చేసిందన్నారు.  

కుట్రల్లో భాగంగానే సుబ్రమణ్యాన్నిసీఎస్‌గా నియమించారని పుల్లారావు ఆరోపించారు. వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన వెంటనే నిజాయతీగా పనిచేస్తున్న అనిల్‌చంద్ర పునేఠాను బదిలీ చేసి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను నిర్మించారని ఆరోపించారు. 

సీఎం చంద్రబాబు ఎవరితోనూ చెప్పించుకునే స్థితిలో లేరన్నారు. కుట్ర రాజకీయాలను సీఎస్‌ మానుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే అధికారం సీఎస్‌కు లేదన్నారు. 

సీఎస్ తన పరిధి దాటి నడుచుకుంటున్నారని అది సరికాదన్నారు. కేబినేట్ ఆమోదించిన పథకాలను అమలు చెయ్యాల్సిన బాధ్యత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఉందన్నారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.  
 

click me!