ఏపీలో కరోనా కలకలం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కోవిడ్

By narsimha lodeFirst Published Sep 1, 2020, 2:28 PM IST
Highlights

ఏపీ మంత్రి పెద్దిరామచంద్రారెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. ఏపీ శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్  కూడ కరోనా బారిన పడడంతో ఆయన హైద్రాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అమరావతి: ఏపీ మంత్రి పెద్దిరామచంద్రారెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. ఏపీ శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్  కూడ కరోనా బారిన పడడంతో ఆయన హైద్రాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కరోనాకు చికిత్స పొందుతున్నారు. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. అంతేకాదు వారంతా క్వారంటైన్ లో ఉండాలని కూడ ఆయన కోరారు. రాష్ట్రంలో పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నేతలు కరోనా బారిన పడి కోలుకొన్నారు. 

also read:తూర్పుగోదావరిలో అదే జోరు: ఏపీలో 4,34,771కి చేరిన కరోనా కేసులు

విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి,అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ, మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా సోకింది. ఇప్పటికే చాలా మంది కరోనా నుండి కోలుకొన్నారు. 

మంగళవారం నాడు ఏపీ శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్ కూడ కరోనా బారిన పడి హైద్రాబాద్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సోమవారంనాడు  కొత్తగా 10,004 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 84 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 4 లక్షల 34 వేల 771కి చేరుకొన్నాయి.

click me!