వైసీపీకి ఇష్టమైన ప్రశ్న: దిమ్మ తిరిగే కౌంటరిచ్చిన లోకేష్

First Published Jun 15, 2018, 4:13 PM IST
Highlights

వైసీపీకి ధీటుగా జవాబిచ్చిన లోకేష్


అమరావతి: ఏపీ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారంటూ అధికార టిడిపిపై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. నాలుగేళ్ళు దాటినా ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని వైసీపీ నేతల విమర్శలకు ట్విట్టర్ వేదికగా  ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్  దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.

శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా వైసీపీ విమర్శలకు సమాధానంగా ఓ లేఖను మంత్రి నారా లోకేష్ పోస్ట్ చేశారు.  వైసీపీ ఇష్టంగా వేసే ప్రశ్నకు సమాధానం దొరికిందంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయంటూ ఆ పార్టీ నేతలు తరచూ వేసే ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చారు.

 

“Where are the jobs?” YCP’s favourite question got answered. Attached is the answer of Ministry of Commerce & Industries to a question raised by YCP MP in Lok Sabha. Do these figures lie? This is exactly why requested you to not boycott assembly. (1/2) pic.twitter.com/r4qpzzFy9b

— Lokesh Nara (@naralokesh)

వైసీపీ ఎంపీ ఒకరు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానాన్ని లోకేష్ ట్వీట్ కు జతపర్చారు. కేంద్ర ప్రభుత్వం  ఇచ్చిన లెక్కలు తప్పా అంటూ లోకేష్ ప్రశ్నించారు.

అసెంబ్లీ ని బాయ్ కాట్ చేయవద్దని మిమ్మల్ని చంద్రబాబునాయుడు రిక్వెస్ట్ చేశారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ నేతలను తీసుకెళ్ళి రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేశారో అక్కడ ఎన్ని ఉద్యోగాలు కల్పించారనే విషయమై తీసుకెళ్ళేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు.అయితే దీనికి వైసీపీ నేతలు సిద్దంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.                             

click me!