సీబీఐ అర్థం మార్చేశారు.. బీజేపీపై లోకేష్ ఫైర్

By ramya neerukondaFirst Published Jan 4, 2019, 3:36 PM IST
Highlights

జగన్ ని కేసుల నుంచి బయటపడేసేందుకు.. ఏపీని దెబ్బ తీసేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్ర పన్నతోందని లోకేష్ ఆరోపించారు.
 

ఆంధ్రా మోదీని కాపాడేందుకు సీబీఐ అర్థాన్ని మార్చేశారని ఏపీ మంత్రి లోకేష్ మండిపడ్డారు. సీబీఐ అర్థాన్ని మోదీ.. బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చేశారని లోకేష్ మండిపడ్డారు.  జగన్ ని కేసుల నుంచి బయటపడేసేందుకు.. ఏపీని దెబ్బ తీసేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్ర పన్నతోందని లోకేష్ ఆరోపించారు.

బీజేపీ.. భారతీయ జోకర్స్ పార్టీగా మారిందన్నారు. ఏపీకి నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్ము, ధైర్యం లేని ఏపీ బీజేపీ నేతలు.. చంద్రబాబు కన్వాయిని అడ్డుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. బీజేపీని ప్రజలు మట్టిలో కలిపేసే రోజులు దగ్గరపడ్డాయని అభిప్రాయపడ్డారు.

ఆంధ్రా లో బీజేపీని ప్రజలు మట్టిలో కలిపేసే రోజులు దగ్గర పడ్డాయి.https://t.co/QCxK2PN65P

— Lokesh Nara (@naralokesh)

 

ఉత్తమ ప్రతిభ కనపరిచిన రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకం కింద అధిక నిధులు రావడం చట్టం ద్వారా వచ్చిన హక్కని.. ఇందులో బీజేపీ పెట్టిన భిక్షఏమీ లేదన్నారు. కేవలం చంద్రబాబు కష్టం మాత్రమే ఉందన్నారు. ఉపాధి హామీలో ఎక్కువ నిధులు కేటాయించామని అర్థం లేని చర్చలు ఏపీ బీజేపీ నేతలు.. వాళ్ల పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉపాధి హామీ పథకం అమలు చేయడం ఎందుకు వెనకబడి ఉన్నారో చెప్పగలరా అని ప్రశ్నించారు.

click me!