సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటా తీస్తామని హెచ్చరించారు మంత్రి కొడాలి నాని. పట్టాభి డబ్బులు తీసుకొని తిడుతున్నాడని కొడాలి నాని ఆరోపించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కావాలనే రెచ్చగొట్టారని ఆయన మండిపడ్డారు.
ప్లాన్ ప్రకారమే ఏపీ సీఎం (ap cm) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై (ys jagan mohan reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి కొడాలి నాని (kodali nani) . రాష్ట్రంలో నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలపై ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటా తీస్తామని హెచ్చరించారు. పట్టాభి (pattabhi) కూడా డబ్బులు తీసుకొని తిడుతున్నాడని కొడాలి నాని ఆరోపించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను (ysrcp) కావాలనే రెచ్చగొట్టారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబువి మొదటి నుంచి మోసపూరిత రాజకీయాలే అని ఆయనలాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏం కాదని, జగన్‌ను ఇంచు కూడా కదపలేరని లోకేశ్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబులా (chandrababu naidu) పెయిడ్ ఆర్టిస్ట్‌లను పెట్టి తిట్టించడం తమకు రాదని నాని స్పష్టం చేశారు. వ్యూహం ప్రకారమే డ్రగ్స్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అమిత్‌షాపై (amit shah) తిరుపతిలో (tirupathi) చంద్రబాబు రాళ్లతో దాడి చేయించారని, ఆయన ఎలాంటి వ్యక్తో అమిత్ షా, మోడీలకు ఎప్పుడో తెలుసని నాని తెలిపారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని అమిత్‌షాను కలుస్తారంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేసేవన్నీ నీచ రాజకీయాలేనని, ఆయన చేసే కొంగ జపాలను ఎవరూ నమ్మరని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
undefined
Also Read:హద్దు మీరితే.. ఇకపైనా రియాక్షన్ ఇలాగే వుంటుంది: టీడీపీ నేతలకు సజ్జల వార్నింగ్
ఏపీలో ఏదో జరిగిపోతోంది.. శాంతిభద్రతలు లేవు.... దేశానికి మాదకద్రవ్యాలను సీఎం జగన్ సప్లై చేస్తున్నాడనే ప్రచారం కోసం టీడీపీ ప్రయత్నం చేసిందంటూ నాని ఆరోపించారు. టీడీపీ నాయకులు గడిచిన 10 రోజుల నుంచి తాడేపల్లి నుంచి గంజాయిని జగన్ ప్రపంచానికి సరఫరా చేస్తున్నాడంటూ ప్రచారం చేస్తున్నారంటూ కొడాలి నాని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఠా నాయకుడని, అవినీతిపరుడని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చంద్రబాబు యత్నించారని మంత్రి గుర్తుచేశారు. జగన్ నూనూగు మీసాల వయసు నుంచి ఆయనపై కుట్రలు చేయడం ప్రారంభించారంటూ నాని ఆరోపించారు.
పోసాని కృష్ణమురళి (posani krishna murali) ఇంటిపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడని.. ఇప్పుడు టీడీపీ ఆఫీస్‌లో (tdp) రెండు కుర్చీలు విరగ్గానే ప్రజాస్వామ్యం ఖూనీ అంటున్నారంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. యుద్ధంలో మగాళ్లతో ఫైట్ చేస్తాం... లోకేష్ లాంటి అటూ ఇటూ కానీ వాళ్ళతో ఏమి చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ (nara lokesh) విసిరిన ఛాలెంజ్‌కు తాము స్పందించలేమని.. జగన్ పెట్టిన అభ్యర్థిపై చిత్తుగా ఓడిపోయిన వాడితో మాకేంటి పోటీ అంటూ నాని దుయ్యబట్టారు. ముందు జీవితంలో ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత లోకేష్ ఛాలెంజ్ చేయాలని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.