గుడివాడ కొడాలి నాని అడ్డా, ఓడించే దమ్ము ఎవరికీ లేదు: వైసీపీ ప్లీనరీలో మంత్రి జోగి రమేష్

Published : Jun 28, 2022, 03:02 PM ISTUpdated : Jun 28, 2022, 03:04 PM IST
గుడివాడ కొడాలి నాని అడ్డా, ఓడించే దమ్ము ఎవరికీ లేదు: వైసీపీ ప్లీనరీలో మంత్రి జోగి రమేష్

సారాంశం

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించే దమ్ము ఎవరికి లేదని వైసీపీ నేతలు అన్నారు. వైసీపీ గుడివాడ ప్లీనరీని మంగళవారం నాడు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నానిలు కొడాలి నానిపై ప్రశంసలు కురిపించారు. 

గుడివాడ: గుడివాడ గడ్డ kodali Nnani అడ్డా అని, దీన్ని ఎవరూ చెక్కు చెదర్చలేరని మంత్రి జోగి రమేష్ చెప్పారు.కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. Gudivada YCP  Plenaryలో  మంత్రి Jogi Ramesh,ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మరో పాతికేళ్ల పాటు సీఎంగా జగన్  ఉంటారని జోగి రమేష్ ధీమాను వ్యక్తం  చేశారు. చంద్రబాబు తన దుష్ట చతుష్టయంతో కలిసి వచ్చినా కూడా కొడాలి నానిని ఓడించలేరని మంత్రి రమేష్ చెప్పారు.  గుడివాడ గడ్డ కొడానాని అడ్డ అని ఆయన చెప్పారు.

కొడాలి నాాని దెబ్బకు చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత Perni Nani చెప్పారు.  గుడివాడకు బ్రాండ్ తెచ్చింది కొడాలి నాని ఆయన గుర్తు చేశారు..  గుడివాడలో కొడాలి నాని ఓడించడం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటుందన్నారు. అసలు టీడీపీ నుండి గుడివాడ నుండి ఎవరు పోటీ చేస్తారని పేర్ని నాని ప్రశ్నించారు. 

సీఎం YS Jagan దించేస్తా అనే స్థాయి నుండి ఇవాళ  కొడాలి నానిని ఓడిస్తా అనే స్థాయికి Chandrababu  దిగజారిపోయాడని పేర్ని నాని ఎద్దేవా చేశారు. కొడాలి నానికి భయపడి ఏదో ఒకటి మాట్లాడుతున్నారన్నారు.  చంద్రబాబే కాదు ఎంత మంది దిగొచ్చినా కొడాలిని ఏం చేయలేరన్నారు.

పేదలకు ఇచ్చిన ఇంటిని Nara Lokesh బాత్‌రూమ్‌తో పోలుస్తున్నాడన్నారు.. అక్రమ సంపాదనతో పెద్ద బాత్రూం కట్టించుకున్నందునే పేదల  ఇళ్లు లోకేష్ కు బాత్ రూమ్ మాదిరిగా కన్పిస్తున్నాయని పేర్ని నాని విమర్శించారు. సొంతింటి కల నెరవేర్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్‌ అని పేర్ని నాని  కొనియాడారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే