బాబు సర్కార్ తప్పిదమే: వరల్డ్ బ్యాంకు వెనక్కి వెళ్లడంపై మంత్రి బుగ్గన

By narsimha lodeFirst Published Jul 22, 2019, 1:14 PM IST
Highlights

అమరావతి ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంకు నిధులు నిలిచిపోవడానికి చంద్రబాబు సర్కార్ కారణమని  ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.

అమరావతి: ప్రపంచ బ్యాంకు నిధులు అమరావతికి ఇవ్వకుండా వెనక్కు వెళ్లడానికి తమ ప్రభుత్వం కారణం కాదని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ప్రపంచబ్యాంకు ఇచ్చిన నివేదికలను  గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

ప్రపంచబ్యాంకు పలు రంగాలకు నిధులను మంజూరు చేస్తామని  ప్రపంచబ్యాంకు ప్రకటించిందని మంత్రి వివరించారు.సోమవారం నాడు ప్రపంచబ్యాంకు రుణం  అమరావతి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేమని వెనక్కు తగ్గిన విషయమై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.

2016 లో అమరావతి ప్రాజెక్టు నిర్మాణం కోసం చంద్రబాబు సర్కార్ ప్రపంచబ్యాంకును కోరిందని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రపంచబ్యాంకుకు ఎన్జీఓ సంస్థలు, రైతులు  ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ప్రపంచబ్యాంకు బృందం ఈ విషయమై ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ ను ఏర్పాటు చేసిందన్నారు.

ఇన్స్‌పెక్షన్ ప్యానెల్  2017 సెప్టెంబర్ 13 నుండి 17వరకు రాష్ట్రంలో పర్యటించిందన్నారు. ఈ పర్యటన తర్వాత వేర్వేరుగా మూడు నివేదికలను ఇచ్చినట్టుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.

అయితే ఈ నివేదికలకు టీడీపీ సర్కార్ సరైన సమాధానం ఇవ్వలేదని చెప్పారు. కానీ, అమరావతి ప్రాజెక్టుకు నిధులను ఇవ్వకపోవడానికి టీడీపీ సర్కార్ కారణంగా బుగ్గన వివరించారు. ఈ నిధులు ఇవ్వకపోవడానికి తమ ప్రభుత్వం కారణం కాదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

అయితే తమ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను నచ్చిన ప్రపంచ బ్యాంకు పలు పథకాలకు నిధులు సమకూరుస్తామని కూడ ఈ నెల 21వ తేదీన ప్రకటించిన విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు.

click me!