హైదరాబాద్‌లో కరెంటే ఉండటం లేదు.. నేను స్వయంగా అనుభవించి వచ్చాను: కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్

Published : Apr 29, 2022, 03:29 PM ISTUpdated : Apr 29, 2022, 03:45 PM IST
హైదరాబాద్‌లో కరెంటే ఉండటం లేదు.. నేను స్వయంగా అనుభవించి వచ్చాను: కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తప్పుబడుతున్నారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తప్పుబడుతున్నారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా చెప్పారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. తాను హైదరాబాద్ వెళ్లి స్వయంగా ఉండి వస్తున్నానని.. అక్కడ అసలే కరెంట్ ఉండటం లేదని చెప్పారు. తాను ఇంట్లో జనరేటర్ వేసుకుని అక్కడ ఉండి వచ్చానని తెలిపారు. 

కేటీఆర్ ఏపీకి వస్తే రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తానని మంత్రి బొత్స అన్నారు. కేటీఆర్‌కు ఎవరో ఫోన్ చేసి చెప్పారేమో.. కానీ తాను హైదరాబాద్‌లో ఉండి అనుభవించి వచ్చానని చెప్పారు. బాధ్యత కలిగిన వ్యక్తి ఇలా మాట్లాడటం తప్పని అన్నారు. వారి ఘనత ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చని.. ఎదుటివాళ్ల గురించి ఇలా మాట్లాడటం సరైనది కాదన్నారు. 

కేటీఆర్ ఏం అన్నారంటే..
కెడ్రాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. పక్కా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌళిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. పక్క రాష్ట్రానికి పోయి వచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో పరిస్థితులు ఎంత బాగున్నాయో తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు. ‘‘నా ఫ్రెండ్ ఒకాయన ఉన్నారు.. ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. అక్కడ వాళ్లకు తోటలు, ఇళ్లు ఉన్నాయి. తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. కేటీఆర్ గారు మీరొక పని చేయండని చెప్పారు. మీ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి.. పక్క రాష్ట్రాలకు పంపిచండి సారు అని చెప్పారు. 

ఎందుకండి అని అడిగితే.. సంక్రాంతికి వాళ్ల ఊరిలో నాలుగు రోజులు ఉన్నానని ఆయన చెప్పారు. కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి.. అన్యాయంగా, అధ్వాన్నంగా ఉందని చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాతే ఊపిరి పీల్చుకున్న ట్టుగా ఉందని ఆయన చెప్పారు. మన్నోళ్లను అందరిని అక్కడికి పంపాలని.. అప్పుడు మన ప్రభుత్వం విలువ తెలసి వస్తుందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు.. నేను ఎక్కువ చెప్పినట్టుగా అనిపిస్తే.. మీరు కూడా పక్క రాష్ట్రాలకు పోయి రండి. నేను కొన్ని మాటలు అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు.. కానీ వాస్తవాలు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!