మంత్రి కొడుకు ఓవర్ యాక్షన్: టీడీపీకే ఓటేస్తామంటూ లబ్ధిదారులతో గుడిలో ప్రమాణం

Published : Feb 09, 2019, 07:43 PM IST
మంత్రి కొడుకు ఓవర్ యాక్షన్: టీడీపీకే ఓటేస్తామంటూ లబ్ధిదారులతో గుడిలో ప్రమాణం

సారాంశం

అంతటితో ఆగిపోలేదు అనకాపల్లిలోని 26వ వార్డులో ఉన్నఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్లి లబ్ధిదారులందరి చేత ప్రమాణం చేయించారు. తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగమని చంద్రబాబు నాయుడు ఇచ్చిన రూ.10వేలుకు కృతజ్ఞతగా తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తామంటూ ప్రమాణం చేయించారు మంత్రిగారి సుపుత్రుడు.   

విశాఖపట్నం: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆయా రాజకీయ పార్టీలు ఓట్లు  కొల్లగొట్టేందుకు ఎక్కడా లేని హామీలు ఇస్తుంటాయి. ఇక అభ్యర్థులు అయితే నానా ఫీట్లు చేస్తుంటారు. అంతేకాదు నానా అవతారాలు ఎత్తుతుంటారు. 

య్ వాలాగానో లేక బార్బర్  గానో హోటల్ లో పనిచేసే వ్యక్తిగానో ఇలా అందివచ్చిన ప్రతీ వేషం వేసి ఓటర్లను ఆకర్షించేందుకు సర్కస్ ఫీట్లు చేస్తుంటారు. తాజాగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలోనూ ఇలాంటి సర్కస్ ఫీటే జరిగింది. 

కానీ ఇది మామూలుగా కాదు ఎందుకంటే చాలా ఓవర్ యాక్షన్. మంత్రి అయ్యన్నగారి రెండో కుమారుడు రాజేష్ పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన తర్వాత ఆయన టీడీపీకే ఓట్లు వెయ్యాలని కోరారు. 

అంతటితో ఆగిపోలేదు అనకాపల్లిలోని 26వ వార్డులో ఉన్నఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్లి లబ్ధిదారులందరి చేత ప్రమాణం చేయించారు. తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగమని చంద్రబాబు నాయుడు ఇచ్చిన రూ.10వేలుకు కృతజ్ఞతగా తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తామంటూ ప్రమాణం చేయించారు మంత్రిగారి సుపుత్రుడు. 

అంతేకాదు చంద్రబాబు నాయుడు ఇస్తున్న పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్లు వంటి కార్యక్రమాలు చేపట్టినందుకు ప్రతీ మహిళ తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యాలని ప్రమాణం చేయించారు. 

ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా లొంగకుండా అయ్యన్నపాత్రుడికి తప్ప మరెవ్వరికి ఓటెయ్యమని చెప్పించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. మంత్రి గారి తనయుడు ప్రమాణంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

కొడుకుమీద ఈగ వాలనివ్వని తండ్రి | Chandrababu Speech Today | Asianet News Telugu
బాబుకు కొత్త బిరుదు ఇచ్చిన నిమ్మల | Nimmala Ramanaidu Speech | Asianet Telugu