మంత్రివర్గం నండి తనను భర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి దేవేనేని ఉమామహేశ్వరరావు కలలు కంటున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. సీఐడీకి ఫిర్యాదు చేస్తే ఏమౌతుందని ఆయన ప్రశ్నించారు.
అమరావతి: తనను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి Devineni Uma Maheswara Rao కలలు కంటున్నారని ఏపీ మంత్రి Ambati Rambabu చెప్పారు. బుధవారం నాడు ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. తనపై CID కి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫిర్యాదు చేస్తే ఏమౌతుందని ఆయన ప్రశ్నించారు. తాను అరెస్ట్ కావాలని, మంత్రి పదవి నుండి తప్పుకోవాలని దేవినేని ఉమా మహేశ్వరరావు కలలు కంటున్నారన్నారు.
Polavaram ప్రాజెక్టును విడతల వారీగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు.గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. నెల రోజుల్లో ప్రతీ గడప గడపకూ వెళ్తున్నామన్నారు. ప్రజలకి తాము చేసింది చెప్తున్నామన్నారు. నెలలో 20 రోజులు ప్రజల్లోనే ఉండాలని సీఎం YS Jagan ఆదేశించారన్నారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఇంకా ఏమైనా ఫిర్యాదులు చేస్తే వాటిని వెంటనే పరిష్కారించే దిశగా ప్రయత్నం చేయాలని సీఎం జగన్ చెప్పారన్నారు.
also read:175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే టార్గెట్: గడప గడపకు ప్రభుత్వంపై వర్క్‌షాప్‌లో జగన్ దిశా నిర్ధేశం
పథకాలు అందడం లేదంటే అందుకు గల కారణం కనుక్కోవాలని సీఎం జగన్ తెలిపారు. గడప గడప కార్యక్రమంపై టీడీపీ విమర్శలు చేస్తుందన్నారు. సీఎం జగన్ ఇస్తున్న పథకాలు, పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. టీడీపీ వాళ్లతో పాటు అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందాయని మంత్రి చెప్పారు. 1.50 లక్షల కోట్ల నిధులు నేరుగా ప్రజలకి అందాయని చెప్పారు..