అవి కూడా ఆన్లైన్ లోనే... స్విగ్గీ, జొమాటోలతో ఏపి మార్కెటింగ్ శాఖ ఒప్పందం

By Arun Kumar PFirst Published May 6, 2020, 10:12 PM IST
Highlights

లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలుచేయడం కోసం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు లాక్ డౌన్ సమయంలో మరింత మెరుగైన సేవలు అందించే దిశగా జగన్ సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ  సంస్ధలయిన స్విగ్గీ, జొమోటాలతో ఏపి మార్కెటింగ్ శాఖ ఒప్పందం చేసింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో విస్తృతమైన నెట్ వర్క్ కలిగిన ఈ సంస్థల ద్వారా కూరగాయల విక్రయాలు జరపాలని... వినియోగదారులకు తాజా కూరగాయలు, పండ్లు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. 

వినియోగదారుల నుండి ఆన్ లైన్ విధానంలో ఆర్డర్లను సేకరించి రైతు బజార్ల నుంచి కూరగాయలను వారికి డెలివరీ చేయనున్నాయి స్విగ్గి, జోమోటా సంస్థలు. మొత్తం 56 రకాల కూరగాయలు, పండ్లను ఆర్డర్ ద్వారా పొందచ్చని మంత్రి తెలిపారు. మినిమమ్ వంద రూపాయల కూరగాయలు, పండ్లు ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్స్ ఇంటివద్దకే వచ్చి వాటిని అందించనున్నారు. 

లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రయోగాత్మకంగా ఈ అమ్మకాలు చేపట్టినట్లు... ప్రస్తుతం వచ్చే స్పందన చూసి పర్మినెంటుగా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు మంత్రి కన్నబాబు. 

click me!