విశాఖ వాల్తేర్ క్లబ్‌పై సిట్ విచారణపై స్టే: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

By narsimha lode  |  First Published Jan 20, 2021, 5:31 PM IST

: విశాఖపట్టణం వాల్తేర్ క్లబ్ పై సిట్ విచారణను నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు  బుధవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


విశాఖపట్టణం: విశాఖపట్టణం వాల్తేర్ క్లబ్ పై సిట్ విచారణను నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు  బుధవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వాల్తేర్ క్లబ్ కు సంబంధించి సివిల్ వివాదాల్లో జోక్యం వద్దని సిట్ కు ఆదేశించింది హైకోర్టు.

Latest Videos

undefined

విశాఖలో భూముల స్కాంపై ఏర్పాటు చేసిన సిట్ ఈ నెల 11వ తేదీన విశాఖలోని వాల్తేర్ క్లబ్ కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించారని క్లబ్ పై చాలాకాలంగా ఆరోపణలున్నాయి. 

విశాఖపట్టణంలోని పేర్ల కుటుంబం నుండి క్లబ్ ప్రతినిధులు 99 ఏళ్ల క్రితం లీజుకు తీసుకొన్నారు. క్లబ్ ప్రతినిధులకు సిట్ తాఖీదులు ఇచ్చింది. తమ వద్దకు వచ్చి భూమి హక్కులను చూపాలని సిట్ పేర్కొంది.వాల్తేర్ క్లబ్ భూములపై ఇప్పటికే కోర్టుల్లో పలు కేసులున్నాయి. ఈ విషయమై క్లబ్ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. 

దీంతో ఈ పిటిషన్ పై విచారణ చేసిన ఏపీ హైకోర్టు సిట్ విచారణపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 


 

click me!