పోలవరం కాలువ పనుల్లో అక్రమంగా మైనింగ్ ను తరలిస్తున్నారని దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది.
అమరావతి: పోలవరం కాలువ తవ్వకాలపై ఏపీ హైకోర్టు సోమవారం నాడు స్టే విధించింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
పోలవరం కాలువలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పిల్లి సురేంద్ర బాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది ఏపీ హైకోర్టు. అక్రమ తవ్వకాలతో గ్రావెల్ అక్రమంగా గ్రావెల్ ను తరలిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు.
undefined
ప్రజా ప్రతినిధులు , అధికారుల అండదండలతోనే అక్రమంగా మైనింగ్ జరుగుతుందని పిటిషనర్ వాదించారు. పిటిషనర్ తరపున ఉమా మహేశ్వరరావు హైకోర్టులో వాదనలు విన్పించారు. పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం కాలువ తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టే విదించింది.
ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.