గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్ధులకు ఊరట.. ఇంటర్వ్యూల నిర్వహణపై ఏపీ హైకోర్టు స్టే

By Siva KodatiFirst Published Jun 16, 2021, 4:32 PM IST
Highlights

గ్రూప్ 1 పరీక్షల ఇంటర్వ్యూల నిర్వహణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్వ్యూల నిర్వహణపై 4 వారాల పాటు స్టే విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 

గ్రూప్ 1 పరీక్షల ఇంటర్వ్యూల నిర్వహణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్వ్యూల నిర్వహణపై 4 వారాల పాటు స్టే విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అభ్యర్ధుల మెయిన్స్ పేపర్ కరెక్షన్ ప్రైవేట్ ఏజెన్సీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నిన్న విచారణ జరిపింది న్యాయస్థానం. ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ చేయాల్సిన పనిని ప్రైవేట్ సంస్థ చేయించడం సరికాదని ఏపీపీఎస్సీకి ఈ అధికారం లేదని పిటిషనర్లు వాదించచారు. ఇద్దరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 

Also Read:గ్రూప్ 1 మెయిన్స్: ప్రైవేట్ సంస్థతో వాల్యుయేషన్... తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

కాగా, గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో సోమవారం మరో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. 138 మంది అభ్యర్థులు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. గ్రూప్‌-1 పరీక్షతో పాటు ఫలితాలను రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరారు. ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న ఇంటర్వ్యూలను రద్దు చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు ప్రమేయం లేకుండా చైర్మన్‌ ఉదయభాస్కర్‌ సారథ్యంలో ప్రధాన పరీక్ష మళ్లీ నిర్వహించేలా ఏపీపీఎస్సీని ఆదేశించాలని కోరారు.
 

click me!