రఘురామ కాలికి గాయాలు: మీ వల్లేనని తేలితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, సీఐడీపై హైకోర్టు ఆగ్రహం

Siva Kodati |  
Published : May 15, 2021, 08:08 PM IST
రఘురామ కాలికి గాయాలు: మీ వల్లేనని తేలితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, సీఐడీపై హైకోర్టు ఆగ్రహం

సారాంశం

సీఐడీ కస్టడీలో ఉన్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కాళ్లపై గాయాలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఎంపీ శరీరంపై గాయాలు ఉండటంతో ఈ వ్యవహారంపై విచారణకు హైకోర్టులో స్పెషల్‌ డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైన సంగతి తెలిసిందే. 

సీఐడీ కస్టడీలో ఉన్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కాళ్లపై గాయాలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఎంపీ శరీరంపై గాయాలు ఉండటంతో ఈ వ్యవహారంపై విచారణకు హైకోర్టులో స్పెషల్‌ డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు దాఖలు చేసిన స్పెషల్‌ మోషన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటైన స్పెషల్‌ డివిజన్‌ బెంచ్‌ విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు సీఐడీ పోలీసుల తీరును మండిపడింది.

రఘురామకృష్ణంరాజు శరీరంపై నిన్న లేని దెబ్బలు ఈ రోజు ఎలా వచ్చాయని ప్రశ్నించింది. గాయాలు తాజాగా తగిలినవని తేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు హెచ్చరించింది. రఘురామకృష్ణంరాజు కాళ్లపై గాయాల చిత్రాలు, దృశ్యాలను ధర్మాసనానికి ఎంపీ తరఫు న్యాయవాదులు చూపించారు.

Also Read:కాళ్ల నిండా గాయాలు.. పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామరాజు ఫిర్యాదు

రిమాండ్‌ రిపోర్టును రద్దు చేసి వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనిపై డివిజన్‌ బెంచ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారు? ఎంపీ రఘురామకు తగిలిన గాయాల పరిశీలనకు వైద్యుల కమిటీ ఏర్పాటు చేయాలి అని కోర్ట్ ఆదేశించింది. 

అంతకుముందు ఎంపీ రిమాండ్ రిపోర్ట్‌ సరిగా లేకపోవడంతో సీఐడీ న్యాయస్థానం మెజిస్ట్రేట్ దానిని తిప్పిపంపారు. ఇదే సమయంలో రఘురామకృష్ణరాజు వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ కార్యాలయం నుంచి కోర్టుకు వచ్చిన ఆయన కాళ్లకు గాయాలు కనిపించాయి.

విచారణ సమయంలో తనను పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, కోర్టుకు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని రఘురామ తరఫు లాయర్లు తెలిపారు. పబ్లిక్ కోర్టులోకి వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లాయర్ గోపినాథ్ అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలున్నాయని ఆయన ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

తిరుపతిలో వైభవంగా గంగమ్మ జాతర: Tirupati Gangamma Jathara Day 2 Celebrations | Asianet News Telugu
Andhra Pradesh Weather Alert: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు | Asianet News Telugu