ఏపీలో తగ్గని కరోనా జోరు: కొత్తగా 22,517 కేసులు.. 3 జిల్లాల్లో స్వైర విహారం

Siva Kodati |  
Published : May 15, 2021, 07:34 PM IST
ఏపీలో తగ్గని కరోనా జోరు: కొత్తగా 22,517 కేసులు.. 3 జిల్లాల్లో స్వైర విహారం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట కర్ఫ్యూను సైతం ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనికి తోడు కొన్ని చోట్ల కఠిన ఆంక్షలను సైతం విధించారు. అయినప్పటికీ కేసుల తీవ్రత పెరుగుతుందే తప్ప ప్రయోజనం మాత్రం శూన్యం. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,517 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.   

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 14,11,320కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 98 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 9271కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 9, అనంతపురం 12, తూర్పుగోదావరి 10, చిత్తూరు 8, గుంటూరు 7, కర్నూలు 5, నెల్లూరు 11, కృష్ణ 5, విశాఖపట్నం 9, శ్రీకాకుళంలో 8, పశ్చిమ గోదావరి 7, ప్రకాశం 5,  కడపలో ఇద్దరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 18,739 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 11,94,582కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 89,535 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,78,80,755కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,07,467 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 2975, చిత్తూరు 2884, తూర్పుగోదావరి 3383, గుంటూరు 1750, కడప 1647, కృష్ణ 1054, కర్నూలు 1102, నెల్లూరు 985, ప్రకాశం 1305, శ్రీకాకుళం 1240, విశాఖపట్నం 1984, విజయనగరం 992, పశ్చిమ గోదావరిలలో 1216 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli