ఏపీ డీజీపీపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు: అలా అయితే రాజీనామా చేయాలి

Published : Sep 14, 2020, 03:01 PM IST
ఏపీ డీజీపీపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు: అలా అయితే రాజీనామా చేయాలి

సారాంశం

పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయకపోతే డీజీపీ రాజీనామా చేయాలని ఏపీ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీపై ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అమరావతి: పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయకపోతే డీజీపీ రాజీనామా చేయాలని ఏపీ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీపై ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యంపై బంధువు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం నాడు హైకోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

వెంకటరాజు అదృశ్యంపై  పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.గతంలో మూడు సార్లు జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందంటూ హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది.

ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు  హైకోర్టు ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపడింది.  గతంలో డీజీపీని పలు సార్లు కోర్టుకు పిలిపించిన మార్పు రాలేదన్న హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 

ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.  ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?