రాజ్యమే శాశ్వతం, ప్రభుత్వం కాదు: ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Jul 22, 2020, 12:33 PM IST

రాజ్యం వేరు, ప్రభుత్వం వేరు అంటూ ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. రాజ్యం శాశ్వతం, ప్రభుత్వం శాశ్వతం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. 


అమరావతి:రాజ్యం వేరు, ప్రభుత్వం వేరు అంటూ ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. రాజ్యం శాశ్వతం, ప్రభుత్వం శాశ్వతం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. 

ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలపై బుధవారం నాడు ఏపీ హైకోర్టు విచారణ చేసింది. ఆస్తుల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున స్పెషల్ జాయింట్ కలెక్టర్ కోర్టులో వాదనలు విన్పించారు. 

Latest Videos

ఆస్తుల అమ్మకాలపై ఇరు వర్గాల వాదనలను హైకోర్టు విన్నది. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ భూముల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ  హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

ప్రభుత్వ భూములను విక్రయించేందుకు గాను బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ నోటీఫికేషన్ జారీ చేశారు. ఎన్ బీసీసీతో కలిసి ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా సంక్షేమ పథకాల, మౌళిక సదుపాయాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.


 

click me!