దేవినేని ఉమా బెయిల్‌ పిటిషన్: హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రేపటికి రిజర్వ్

Siva Kodati |  
Published : Aug 03, 2021, 04:32 PM IST
దేవినేని ఉమా బెయిల్‌ పిటిషన్: హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రేపటికి రిజర్వ్

సారాంశం

హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. బుధవారం బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. బుధవారం బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. కాగా, కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న సమాచారంతో దేవినేని ఉమ పరిశీలనకు వెళ్లారు. ఈ క్రమంలోనే జి. కొండూరులో అలజడి చెలరేగింది. దీనంతటికి మాజీ మంత్రే కారణమంటూ ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ దేవినేని ఉమ ఏపీ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు తనపై అన్యాయంగా హత్యాయత్నం, కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఉమ పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. 

Also Read:నా భర్తకు జైలులో ప్రాణహాని: హైకోర్టు సిజేకు దేవినేని ఉమ భార్య అనుపమ లేఖ

కాగా గత బుధవారం దేవినేని ఉమకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది. మరోవైపు దేవినేని ఉమా కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే కక్షపూరితంగా ఉమాను అరెస్టు చేశారని మండిపడ్డారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉమా రాత్రింబవళ్లు పనిచేశారని, జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని టీడీపీ అధినేత ఆకాంక్షించారు. 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?