పేదవాడికి మెరుగైన వైద్య చికిత్స అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
అమరావతి: పేదవాడికి మెరుగైన వైద్య చికిత్స అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ఆయన బుధవారం నాడు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఏడు టీచింగ్ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
మరో 16 టీచింగ్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మరో 16 టీచింగ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం చెప్పారు. వీటన్నింటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను మరింత బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వాసపత్రుల్లో అత్యాధునిక టెక్నాలజీతో సిటీ స్కాన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా చెప్పారు. . వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, వాలంటీర్లు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.