ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఫీజుల విషయమై పిటిషనర్లతో చర్చించి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఫీజుల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.ఏపీ రాష్ట్రంలోని private ఆన్ అయిడెడ్ కాలేజీల ఫీజుల నిర్ధారణపై రాష్ట్ర ప్రభుత్వ అప్పీలుపై ap high court గురువారం నాడు తీర్పును వెల్లడించింది.
also read:టీటీడీ బోర్డు నియామకంపై వివాదం: 18 మంది సభ్యులకు హైకోర్టు నోటీసులు
ప్రైవేట్ డిగ్రీ కాలేజీల ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. అయితే ఈ జీవోను డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేశాయి. డిగ్రీ కాలేజీలను మూడు కేటగిరిలుగా విభజించి ఫీజులు నిర్ణయించడాన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు వ్యతిరేకించాయి. ఈ విషయమై ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం ముందు పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు విన్పించారు.
గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కనపెట్టింది. నిబంధనల మేరకు పీజులు చెల్లించేందుకు నాలుగు వారాల సమయాన్ని ఇచ్చింది. పిటిషనర్లతో మాట్లాడి నాలుగు వారాల్లో ఫీజులు నిర్ణయించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును గతంలో రిజర్వ్ చేసింది. ఇవాళ ఈ తీర్పును వెల్లడించింది.