ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టుగా కనిపిస్తోంది.. రుషికొండ తవ్వకాల అంశంపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

Published : Oct 13, 2022, 01:51 PM ISTUpdated : Oct 13, 2022, 02:17 PM IST
ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టుగా కనిపిస్తోంది.. రుషికొండ తవ్వకాల అంశంపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

సారాంశం

విశాఖపట్నంలోని రుషికొండలో తవ్వకాల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి పేరిట కొండలను కొట్టేస్తున్నారని వ్యాఖ్యానించింది. అభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారని.. ప్రభుత్వంలో విభిన్న వైఖరులేమిటని ప్రశ్నించింది.

విశాఖపట్నంలోని రుషికొండలో తవ్వకాల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి పేరిట కొండలను కొట్టేస్తున్నారని వ్యాఖ్యానించింది. అభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారని.. ప్రభుత్వంలో విభిన్న వైఖరులేమిటని ప్రశ్నించింది. రుషికొండ తవ్వకాలపై దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. కేంద్ర అటవీశాఖ ఆధ్వర్యంలో రుషికొండ తనిఖీ చేయాలని పంపుతామని.. కమిటీ వేస్తే మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వానికి ప్రశ్నించింది. 

ఇక, విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున న్యాయవాదులు.. 9.88 ఎకరాలకు అనుమతిస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని చెప్పారు. గూగుల్ మ్యాప్‌లను అందించారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం 9.88 ఎకరాలకే పరిమితమయిందని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా.. గూగుల్ మ్యాప్ లు అబద్దాలు చెబుతాయా? అని ప్రశ్నించారు. 

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి ఆఫిడవిట్ దాఖలు చేస్తామని.. అప్పటివరకు సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టుగా  ఉందని సందేహం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత నిజా, నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం