బిల్లుల విడుదలలో జాప్యం.. ఐఏఎస్ సత్యనారాయణపై ఏపీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్

Siva Kodati |  
Published : Jul 12, 2022, 03:03 PM IST
బిల్లుల విడుదలలో జాప్యం.. ఐఏఎస్ సత్యనారాయణపై ఏపీ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్

సారాంశం

ఏపీ ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై రాష్ట్ర హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విద్యాశాఖ కు సంబంధించిన బిల్లుల విడుదలలో ఆలస్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ విచారణకు సత్యనారాయణ గైర్హాజరయ్యారు.  

తమ ఆదేశాలను బేఖాతరు చేయడం, తదితర కారణాల వల్ల ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వానికి చెందిన అధికారులపై రాష్ట్ర హైకోర్టు మండిపడిన ఘటనలు వున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విద్యాశాఖ కు సంబంధించిన బిల్లుల విడుదలలో ఆలస్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ విచారణకు సత్యనారాయణ గైర్హాజరయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ విచారణకు ఆర్ధిక శాఖ నుంచి సీనియర్ ఐఏఎస్ లు ఎస్ఎస్ రావత్, రాజశేఖర్, సురేష్ కుమార్ మాత్రం హాజరయ్యారు. 

ఇకపోతే.. Mgnrega Case బిల్లుల చెల్లింపులపై Court ధిక్కరణకు కేసులో IAS అధికారులపై AP High Cour గత నెల 15న కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఎఎస్ అధికారులు  గోపాలకృష్ణ ద్వివేది, రావత్, కోన శశిధర్ లు దీనికి సంబంధించి కోర్టుకు హాజరయ్యారు. ప్రతి ఆర్డర్ లోనూ కోర్టు ధిక్కార కేసులు నమోదైతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. 

ఇటీవల Kurnool  లో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని Judge ప్రస్తావించారు. బిల్లులు చెల్లించని కారణంగానే నిందితులు Suicide కు పాల్పడినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయని జడ్జి గుర్తు చేశారు.  బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకొన్న కుటుంబలకు  ఎవరు ఆసరా కల్పిస్తారని జడ్జి ప్రశ్నించారు. పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. బిల్లులు చెల్లించకపోతే కాంట్రాక్టర్లు ఎలా పనులు చేస్తారని కోర్టు అడిగింది. 

ALso Read:ఐఎఎస్‌లపై ఏపీ హైకోర్టు సీరియస్: ఉపాధి హామీ బిల్లుల కేసులో హైకోర్టు ఆగ్రహం

గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది మార్చి వరకు CFMS ద్వారా జరిగిన చెల్లింపుల స్టేట్ మెంట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ప్రకారంగా బిల్లులు ఇవ్వడం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుపై విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసిందని తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

గతంలో ఏపీలో పలువురు ఐఎఎస్ లకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఎఎస్ లకు శిక్షలు కూడా విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఎఎస్ అధికారి చిన వీరభద్రుడికి కి ఏపీ హైకోర్టు 4 వారాల పాటు జైలు శిక్ష ఈ ఏడాది మే 3న విధించింది.  అంతేకాదు రూ. 2 వేలు జరిమానాను విధించింది.2001లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు BPED చదువుకునేందుకు వీలు కల్పిస్తూ AP High Court ఉత్తర్వులు జారీ చేసింది.  బీపీఈడీ చదువుకునే ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీత భత్యాలను చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.అయితే కోర్టు ఉత్తర్వుల అమల్లో జాప్యం చేసింది.

PREV
click me!

Recommended Stories

Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu
CM Chandrababu Naidu: అధికారం దుర్వినియోగం చేసేవారిపై బాబు సీరియస్| Asianet News Telugu