కోవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ

By AN TeluguFirst Published May 19, 2021, 3:26 PM IST
Highlights

కోవిద్ నియంత్రణ పై గుంటూరు కి చెందిన సామాజిక కార్యకర్త జర్నలిస్ట్  తోట సురేష్ బాబు, ఏపీ సిఎల్ఏ, ఐలు, సుమోటో పిటిషన్ లపై ఏపీ హై కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

కోవిద్ నియంత్రణ పై గుంటూరు కి చెందిన సామాజిక కార్యకర్త జర్నలిస్ట్  తోట సురేష్ బాబు, ఏపీ సిఎల్ఏ, ఐలు, సుమోటో పిటిషన్ లపై ఏపీ హై కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఈ విచారణలో అవసరానికి సరిపడా రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా జరగటం లేదని ప్రభుత్వం తెలిపింది. కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టుకు తెలిపింది.

ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి డిమాండ్ కి సరిపడా జరగటం లేదని ప్రభుత్వం తెలిపింది. తక్కువ కేసులు ఉన్న టీఎస్ కి 690 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి, ఎక్కువ కేసులు ఉన్న ఏపీకి 580 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశారని 
ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

100 టన్నుల ఆక్సిజన్ లో మహారాష్ట్ర కు 97 టన్నులు, ఏపీకి 3 టన్నుల సరఫరా చేశారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇలా ఎలా చేస్తారని కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

అన్ని రాష్ట్రాలకు అవసరాలకు సరిపడా సరఫరా బ్యాలెన్సింగ్ చేస్తామని కేంద్రం తెలిపింది. ఆసుపత్రుల్లో బిల్ చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ద్వారా చేయాలని హైకోర్టు ఆదేశించింది.

అంతేకాదు అవసరానికి సరిపడా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్లు ఎపుడు చేస్తారని కూడా  హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి కేంద్రం సమాధానమిస్తూ మూడు నెలల సమయం పడుతుందని తెలిపింది.

అయితే ఇది చాలా ఎక్కువ సమయమని, వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశించింది. కంప్రెషర్ల తయారీలో జాప్యం జరుగుతోందని, జూన్ మొదటి వారంలో 15 ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం తెలిపింది. కర్ఫ్యూ వల్ల కేసుల నమోదులో తేడాలు ఏమన్నా వచ్చాయా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

click me!