బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం..!

Published : Aug 04, 2021, 10:06 AM ISTUpdated : Aug 04, 2021, 10:09 AM IST
బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం..!

సారాంశం

బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

మైనర్ బాలిక పై ఓ చర్చి పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. బాలిక గర్భం దాల్చింది.  ఈ దారుణ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చర్చి పాస్టర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాస్టర్‌ కుంచే వెంకటేశ్వరరావు (మార్క్‌)  నల్లజర్ల మండలం అయ్యవరంలో చర్చిని నెలకొల్పి ప్రార్థనలు చేసేవాడు. ఈ క్రమంలో కూలి పనులు చేసుకునే ఓ కుటుంబం ఆయన వద్దకు వచ్చి ప్రార్థనలు చేయించుకునేది. ఈ క్రమంలో వారి కుమార్తె (14)పై కన్నేసిన అతను తరచూ అత్యాచారం చేస్తూ.. ఎవరికైనా చెబితే దేవుడు శపిస్తాడని బెదిరించేవాడు.

దీంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. సోమవారం కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు బాలిక నాలుగు నెలల గర్భంతో ఉన్నట్టు తేల్చడంతో విషయం వెలుగు చూసింది. ఈ విషయం గ్రామస్థుల దృష్టికి వెళ్లడంతో వారు మార్క్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనంతపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్