చంద్రబాబుకు ఊరట: టీడీపీ ఆఫీసుపై ఆర్కే పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

By Siva KodatiFirst Published Jul 23, 2020, 3:07 PM IST
Highlights

టీడీపీ రాష్ట్ర కార్యాలయ స్థలం స్వాధీనం చేసుకోవాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది

టీడీపీ రాష్ట్ర కార్యాలయ స్థలం స్వాధీనం చేసుకోవాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. టీడీపీ కార్యాలయ భనం అక్రమ నిర్మాణమని.. భవనాన్ని కూల్చేసి సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూమంగళగిరి ఎమ్మెల్యే, ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ఆత్మకూరు పరిధిలోని సర్వే నెంబర్ 392లో ఉన్న 3.65 ఎకరాల వాగు పోరంబోకు భూమని ఆయన తెలిపారు. తెలుగుదేశం కార్యాలయ నిర్మాణానికి 99 ఏళ్ల పాటు లీజుకిస్తూ గత ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందని ఆర్కే పిటిషన్‌లో పేర్కొన్నారు.

పర్యావరణ చట్టాల ప్రకారం.. వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూములను నిర్మాణాలకు కేటాయించడం చట్ట విరుద్ధమని ఆళ్ల ప్రస్తావించారు. అదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆర్కో కోర్టుకు వివరించారు.

దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. దీనిపై గతంలోనే రిట్ పిటిషన్  దాఖలైనందున పిల్ అవసరం లేదని తెలిపింది. పిల్ వేయడంలో రామకృష్ణారెడ్డి ఆసక్తి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. 

click me!