కొత్త జిల్లాల ఏర్పాటు:మధ్యంతర ఉత్తర్వులకు ఏపీ హైకోర్టు నిరాకరణ

By narsimha lode  |  First Published Mar 14, 2022, 12:47 PM IST

కొత్త జిల్లా ఏర్పాటు విషయమై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. తుది ప్రకటన వెలువడనందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. 


అమరావతి: New Districts  ఏర్పాటు విషయ,మై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు  AP high Court  నిరాకరించింది. కొత్త జిల్లాల ఏర్పాటు అంశానికి సంబంధించి  దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు సోమవారం నాడు విచారణ నిర్వహించింది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు  371 డి కి విరుద్దంగా ఉన్నాయని పలువురు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. Guntur కు చెందిన విజయ్  కుమార్, Srikakulam జిల్లాకు చెందిన సిద్దార్ధ, Prakasamజిల్లాకు చెందిన రామారావులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్లు దాఖలు చేసిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. తుది ప్రకటన చేయనందున మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. 

Latest Videos

ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను  క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ కమిటీని ఏర్పాటుచేశారు.  కొత్త జిల్లాలకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు సర్కారు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వీటిని స్వీకరిస్తున్నారు. తాము అందుకున్న విజ్ఞప్తులను కలెక్టర్లు www. drp.ap.gov.in వెబ్‌ సైట్‌లో ప్రతీరోజూ అప్‌లోడ్‌ చేయాల్సి వుంటుంది. ఇలా అప్‌లోడ్‌ చేసే ప్రతి అభ్యంతరం, సూచనను పరిశీలించి దానిపై రిమార్కు రాయాలి.

ఆ తర్వాత వాటిని కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి అది సహేతుకమైనదా? పరిగణలోకి తీసుకోవాలా లేదా? అని నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి అభ్యంతరం, పరిశీలనను స్వీకరించాలా? తిరస్కరించాలో? చెబుతూ ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.ఈ నెల 3 వ తేదీ వరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై 7500 అభ్యంతరాలు వచ్చాయని ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ ప్రకటించారు.

ప్రాథమికంగా జిల్లాల వారీగా సాధ్యమైనంత వరకు ఫీల్డ్‌లోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశామని అన్నారు. మార్చి 3వ తేదీన సూచనల స్వీకరణ అయిపోయిన తర్వాత.. వారం రోజులు వాటిపై అధ్యయనం చేయనున్నట్టుగా చెప్పారు. కొత్త జిల్లాలపై ఈ నెలాఖరు లోపు తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టుగా  ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ చెప్పారు. కొత్త జిల్లాలకు అధికారులు, ఉద్యోగుల విభజనను పూర్తి చేస్తామని తెలిపారు.  జిల్లా కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి, సంబంధిత విభాగాలకు నివేదికలను పంపించడం జరుగుతుందని విజయ్ కుమార్ తెలిపారు.


 

click me!