ఈ నెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి.. ఏపీ సీఎస్‌కు హైకోర్టు ఆదేశం

Published : Dec 14, 2022, 04:51 PM IST
ఈ నెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి.. ఏపీ సీఎస్‌కు హైకోర్టు ఆదేశం

సారాంశం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమ ముందు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమ ముందు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాల నిర్మాణంపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన నిర్మాణలుచేపడుతున్నారని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పాఠశాలల ఆవరణలో ఎలాంటి విద్యేతర నిర్మాణాలు చేపట్టకూడదని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్వర్లు జారీచేసింది. 

అయితే అయినప్పటికి నిర్మాణాలు చేపట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించారని పిటిషన్లరు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ అధికారులు ఆ నిర్మాణాలకు బిల్లులు చెల్లించి హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని పిటిషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.  ఈ క్రమంలోనే హైకోర్టు.. పాఠశాలల ప్రాంగణాల్లో ఇతర భవనాల నిర్మాణంపై ఈ నెలల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu
Minister Satya Kumar Yadav Pressmeet: జిల్లాల విభజనపై సత్యకుమార్ యాదవ్ క్లారిటీ| Asianet News Telugu