ఏపీలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

Siva Kodati |  
Published : Nov 23, 2022, 04:19 PM IST
ఏపీలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

సారాంశం

రాష్ట్రంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 600 అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ల పోస్టులు భర్తీకి వీలు కలగనుంది.

రాష్ట్రంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీ చేపట్టడం లేదని, అలాగే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన హైకోర్టు పోస్టుల భర్తీపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేయడంతో పాటు సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 600 అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ల పోస్టులు భర్తీకి వీలు కలగనుంది. హైకోర్టు తీర్పుతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు