చిక్కుల్లో హీరో బాలకృష్ణ : హైకోర్టు నోటీసులు

By Nagaraju penumalaFirst Published Feb 23, 2019, 7:10 AM IST
Highlights

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారంటూ ఆనాటి వైసీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఉమ్మడి హై కోర్టును ఆశ్రయించారు. బాలయ్యపై ప్రపా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పిటీషన్ లో పేర్కొన్నారు.  

 అమరావతి: సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హై కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన పిటీషన్ పై బాలయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారంటూ ఆనాటి వైసీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఉమ్మడి హై కోర్టును ఆశ్రయించారు. బాలయ్యపై ప్రపా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పిటీషన్ లో పేర్కొన్నారు.  

ఈ పిటీషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బాలకృష్ణకు నోటీసుల అంశంపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి, కర్నూలు జాయింట్ కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. 

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన నేపథ్యంలో బాలకృష్ణపై కేసు నమోదు చెయ్యాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని స్ పష్టం చేసింది. బాలకృష్ణకు వ్యక్తిగతంగా నోటీసులు అందజెయ్యాలని ఆదేశించింది. అనంతరం విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. 

click me!