చంద్రబాబు ప్రచార పిచ్చికి జనం బలి.. గుంటూరు తొక్కిసలాట ఘటనపై మంత్రి రజనీ

Siva Kodati |  
Published : Jan 01, 2023, 09:14 PM IST
చంద్రబాబు ప్రచార పిచ్చికి జనం బలి.. గుంటూరు తొక్కిసలాట ఘటనపై మంత్రి రజనీ

సారాంశం

చంద్రబాబు ప్రచార పిచ్చికి జనం బలవుతున్నారని మండిపడ్డారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ. చంద్రబాబు గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ముగ్గురు మరణించగా , పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో క్షతగాత్రులను మంచి పరామర్శించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ముగ్గురు మరణించగా , పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అధికారులు, పోలీసులను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రచార పిచ్చి కారణంగానే న్యూ ఇయర్ రోజు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చావులన్నింటికీ ఆయనే బాధ్యత వహించాలని విడదల రజనీ డిమాండ్ చేశారు. 

ALso Read: గుంటూరు : చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట, ముగ్గురి మృతి .. పలువురికి తీవ్ర గాయాలు

రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది, నిన్న గాక మొన్న కందుకూరులో 8 మంది, ఈరోజు గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల నుంచి చంద్రన్న కానుకపై ప్రచారం నిర్వహించారని రజనీ మండిపడ్డారు. వాహనాలను పెట్టి జనాలను తరలించారని ఆమె ఆరోపించారు. అంతకుముందు తొక్కిసలాట చోటు చేసుకున్న ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ, కలెక్టర్ పరిశీలించారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ.. ఫస్ట్ కౌంటర్ దగ్గరే ప్రమాదం జరిగిందన్నారు. బారికేడ్లు విరగడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ఎస్పీ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu