కర్నూలుకు గుట్టుగా న్యాయ రాజధాని: లోకాయుక్త ,హెచ్‌ఆర్‌సీ ఆఫీసులు అక్కడికే.. భవనాల వేటలో అధికారులు

By Siva KodatiFirst Published Aug 7, 2021, 8:25 PM IST
Highlights

కర్నూలులో న్యాయ రాజధానికి సంబంధించి కార్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా లోకయుక్త కార్యాలయం కోసం అధికారులు ఇవాళ భవనాలు పరిశీలించారు. 

కర్నూలులో న్యాయ రాజధానికి సంబంధించి కార్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోకయుక్త కార్యాలయం కోసం అధికారులు ఇవాళ భవనాలు పరిశీలించారు. బళ్లారి చౌరస్తా, సంతోష్ నగర్‌లలో లోకాయుక్త జస్టిస్ పీ. లక్ష్మణ్ రెడ్డి స్వయంగా భవనాలను పరిశీలించారు. ఇప్పటికే కర్నూలులో మానవ హక్కుల కమీషన్ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. 

ఏపీ మానవ హక్కుల కమిషన్‌, లోక్‌ అదాలత్‌ రాష్ట్ర కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి సంబంధించి గత నెలలోనే ఏపీ హెచ్‌ఆర్సీ జ్యుడీషియల్‌ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడు శ్రీనివాసరావు కర్నూలులో పర్యటించారు. స్థలాల పరిశీలనలో భాగంగా అప్పటి కలెక్టర్‌ వీరపాండియన్‌తో భేటీ అయ్యారు. జిల్లా అధికారులతో చర్చించారు. త్వరలో ఏపీ హెచ్‌ఆర్సీ, లోక్‌ అదాలత్‌ కార్యాలయాలు అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్డీవో హరిప్రసాద్‌తో కలిసి కర్నూలు నగరంలోని పలు భవనాలను పరిశీలించారు

click me!