పాము కాట్లకు విరుగుడు: 29న బాబు ప్రభుత్వం సర్పయాగం

By pratap reddyFirst Published Aug 28, 2018, 10:54 AM IST
Highlights

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్పయాగం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలో సర్పాలు బుసకొడుతున్నందు వల్ల సర్పాలకు చెందిన దైవాన్ని సంతోషపెట్టడానికి ఆ యాగం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్పయాగం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలో సర్పాలు బుసకొడుతున్నందు వల్ల సర్పాలకు చెందిన దైవాన్ని సంతోషపెట్టడానికి ఆ యాగం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

గత రెండు నెలల కాలంలో కృష్ణా జిల్లాలో పాముల కాట్లకు గురై ఇద్దరు మరణించగా, దాదాపు 100 మంది ఆస్పత్రుల పాలయ్యారు. మోపిదేవిలోని ప్రతిష్టాత్మకమైన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో సర్పయాగం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 

సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 29వ తేదీన సర్పయాగం చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూజారాలు యాగం చేస్తారు. ఈ యాగంలో కృష్ణా జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం పాల్గొంటారు.

భారీ వర్షాలకు, కృష్ణా నదికి విపరీతంగా వచ్చిన వరదలకు సర్పాలు నాగాయలంక, అవనిగడ్డ వంటి ప్రాంతాల్లోకి పెద్ద యెత్తున వచ్చి చేరాయి. దివిసీమ పాము కాట్లతో గజగజ వణికిపోతోంది. 

పాము కాట్లకు అవనిగడ్డలో ఒకరు, గన్నవరంలో మరొకరు మరణించారు. గత పది రోజులుగా అవనిగడ్డ ఆస్పత్రికి పెద్ద యెత్తున పాము కాటు బాధితులు చేరుకున్నారు. సర్పయాగం ఆలోచనను హేతువాద సంఘం జన విజ్ఞాన సంస్థ వ్యతిరేకిస్తోంది. అతీత శక్తులపై విశ్వాసాన్ని పెంచే ఈ యాగాన్ని చేయకూడదని ఆ సంఘం అంటోంది. 

ఈ కింది వార్తలు చదవండి

పాముకాటుకు మరో ఇద్దరు బలి, కృష్ణా జిల్లాలో పెరుగుతున్న మృతులు

పాముకాటుకు మరో ఇద్దరు రైతుల బలి....22 రోజుల్లో 85 మందికి పాముకాట్లు

ఎర్ర చందనం స్మగ్లర్ చిట్కా: పాములు దగ్గరికి రావద్దంటే...

దివిసీమను వణికిస్తున్న పాములు.. మోపిదేవి ఆలయంలో జనాల పూజలు

click me!