స్థిరంగా కరోనా కేసులు: ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు.. వినాయక చవితి వేడుకలపైనా సూచనలు

By Siva KodatiFirst Published Sep 2, 2021, 7:11 PM IST
Highlights

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా వున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్లు  తెలిపింది. అలాగే వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ప్రజలకు సూచించింది.

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా వున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్లు  తెలిపింది. అలాగే వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ప్రజలకు సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో గణపతి విగ్రహాలను పెట్టొద్దని వైద్యాధికారులు సిఫారసు చేశారు. అలాగే నిమజ్జన ఊరేగింపులు కూడా వద్దని వైద్యాధికారులు స్పష్టం చేశారు.

ALso Read:తూ.గోలో మళ్లీ పెరిగిన కేసులు.. ఏపీలో కొత్తగా 1378 మందికి పాజిటివ్, 20,13,785కి చేరిన సంఖ్య

ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీలను గుర్తించి 90 రోజుల్లోగా భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ తర్వాత వైద్యులు, సిబ్బంది లేరనే మాటలు వినిపించకూడదని సీఎం అన్నారు. బయోమెట్రిక్‌తో పక్కాగా హాజరు, పనితీరు పర్యవేక్షణ వుండాలని జగన్ ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన సేవలు అందాలని జగన్ ఆదేశించారు. డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే ఆసుపత్రుల్లో వుండాలని సీఎం సూచించారు. 

click me!