కరోనా రోగులకు వెసులుబాటు... ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజులు ఖరారు

By Arun Kumar PFirst Published Jul 8, 2020, 10:17 PM IST
Highlights

కరోనా రోగుల నుండి వైద్యం పేరిట ప్రైవేట్ హాస్పిటల్స్ అధికమొత్తంలో డబ్బులు వసూలు చేయకుండా ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

అమరావతి: కరోనా రోగుల నుండి వైద్యం పేరిట ప్రైవేట్ హాస్పిటల్స్ అధికమొత్తంలో డబ్బులు వసూలు చేయకుండా ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఏకరీతి ఫీజులను ఖరారు చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి పేరుతో ఈ జీవో జారీ అయ్యింది. 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరోనా చికిత్సలో భాగంగా రోజుకు 3250 రూపాయలు వెంటిలేటర్, ఎన్‌ఐవి లేకుండా ఐసియూలో చికిత్స పొందుతుంటే రోజుకు 5480 రూపాయలు, ఎన్‌ఐవి ఉండి ఐసియూలో చికిత్స పొందుతుంటే 5980 రూపాయలు, వెంటిలేటర్ ఉండి ఐసియూలో చికిత్స పొందుతుంటే 9580 రూపాయలు, వెంటిలేటర్ ఉండి సెప్టిక్ షాక్ చికిత్స చేస్తే రోజుకు 10380 రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సి వుంటుంది. ప్రైవేట్ హాస్పటల్స్ ఈ ధరలను ఖచ్చితంగా పాటించాలని వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. 

తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవలే ప్రైవేట్ హాస్పిటల్స్ కు కరోనా వైద్య ఫీజులకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్సకు రేట్స్ ఫిక్స్ చేశారు. ఐసోలేషన్ కు 4000/-, ఐసీయు వెంటిలేటర్ అవసరం లేకుంటే.. 7500/-, వెంటిలేటర్ అవసరం ఉంటే – 9000/- ధరలను నిర్ణయించింది తెలంగాణ సర్కార్.  

click me!